ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (12:48 IST)

ఎస్సీ,ఎస్టీలకు జగన్ ఏంచేశాడో?: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

రెండేళ్ల తనపాలనపై ముఖ్యమంత్రి విడుదలచేసిన పుస్తకంలో  ప్రజలకు నేరుగా రూ.95,528కోట్లను వారి ఖాతాలకు పంపినట్లు చెప్పుకున్నాడని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు, ఈబీసీ, బ్రాహ్మణులు సహా అన్నివర్గాలకు ప్రత్యక్ష నగదుబదిలీ ద్వారా ప్రయోజనం చేకూర్చామని కూడా ఆయన చెప్పుకున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.

బుధవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...!
 
ముఖ్యమంత్రి చెప్పినవర్గాల్లో ఎస్సీ,ఎస్టీల గురించి పక్కన పెట్టండి. వారికి రాజ్యాంగంద్వారా సంక్రమించినహక్కులు, అవకాశాలున్నాయి కాబట్టి. మిగిలిన వర్గాలైన కాపులు, బీసీలు, బ్రాహ్మణులు, ఈబీసీలకు వర్గాలవారీగా చంద్రబాబు ప్రభుత్వంలోనే సబ్ ప్లాన్ లుఏర్పాటుచేసి, సరిపడినన్ని నిధులు సమకూర్చడం జరిగింది. అందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్ లో కేటాయింపులుకూడా చేయడం జరిగింది.

తన ఐదేళ్లపాలనలో చంద్రబాబునాయుడు ఒక్కడే సబ్ ప్లాన్ నిధులను, ఆయావర్గాల సంక్షేమానికి మాత్రమే వినియోగిం చారు. 90శాతం నిధులను ఆయావర్గాలకోసం ఖర్చుచేయ డం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు రూ.40,253కోట్లు కేటాయించి, ఆనిధుల్లో 90శాతం వారికే ఖర్చుపెట్టడం జరిగింది. ఆనాడు ఎస్సీ, ఎస్టీసంక్షేమశాఖామంత్రిగా నేనే ఉన్నాను..కాబట్టి ఆయావర్గాలకు ఏం చేశామో నాకు తెలుసు.

ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను ఇప్పుడున్న ప్రభుత్వంలా పక్కదారి పట్టించకుండా, వారి ఆర్థికస్వావలంబనకోసమే టీడీపీప్రభుత్వం వినియోగించింది.  ఇప్పుడున్న ముఖ్యమంత్రేమో ఒకపక్కన నాకు కులాలు, మతాలు లేవంటాడు. అందరికీ ఇవ్వడంతప్పుకాదు. కానీ ఎస్సీ,ఎస్టీలకు రాజ్యాంగంప్రకారం అదనపు సౌకర్యాలు కల్పించాలి.

వారు తరతరాలుగా సమాజంలో అణచివేతకు గురవుతున్నారు కాబట్టి, రాజ్యాంగంలో అంబేద్కర్ ఆయా వర్గాలకు ప్రత్యేకహక్కులు కల్పించారు. ఏప్రభుత్వమైనా సరే, ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిననిధులను వారికే వెచ్చించింది.  అలా ఖర్చుపెట్టకపోతే, అదినేరంకూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీల నిధులను ఇతరత్రా పథకాలకు మళ్లిస్తోంది. సబ్ ప్లాన్ కేటాయింపులు బాగా తగ్గించిందికాక, నవరత్నాలకు, గులకరాళ్లకు ఎస్సీ,ఎస్టీల నిధులను దారిమళ్లిస్తున్నాడు.

టీడీపీప్రభుత్వంలో ఎస్సీ కాలనీల్లో దాదాపు 5,384కిలోమీటర్ల వరకు సీ.సీ.రోడ్ల నిర్మాణంచేపట్టాము. ఊరికే నోటిమాటలుచెప్పడంకాదు.. ఏఏ గ్రామాల్లో వేశామోకూడాచూపిస్తాం. రోడ్లతోపాటు, డ్రైనేజ్ లు, మంచినీటి వసతి కల్పించాము. ఈప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా పదిమీటర్ల రోడ్డు వేసిందా? అదనంగా ఎక్కడైనా ఎస్సీ కాలనీల్లో సౌకర్యాలుకల్పించారా?

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో దాదాపు 1300గ్రామాల్లో రూ.1600కోట్లతో అభివృద్ధి పనులుచేపట్టాము. వాటిలో దాదాపు రూ.300కోట్లను తాగునీతి సౌకర్యాలకి వినియోగించడం జరిగింది. తూర్పుగోదావరిలోని రంపచోడ వరం నుంచి శ్రీకాకుళంలోని పాలకొండవరకు ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో అనేకరకాల అదనపు సౌకర్యాలుకల్పించాము.  ఈప్రభుత్వం వచ్చాక అలా...ఈ పనిచేశామని చెప్పుకోలేకపోతోంది? 

టీడీపీప్రభుత్వంలో చేశాము కాబట్టే చెబుతున్నాం. ఎస్సీ, ఎస్టీ వర్గాల నిరుద్యోగయువతకు ఆర్థికంగా అండగా ఉండటమేకాకుండా, 50శాతం సబ్సిడీపై వారికి బ్యాంకురుణాలు అందించాము. ఎస్సీ,ఎస్టీలకు ఎస్సీకార్పొరేషన్, గిరిజనులకు ట్రైకార్ కార్పొరేషన్ ద్వారా అనేకవిధాలుగా చేయూతనందించాము. ఆయావర్గాల్లో భూమిలేనివారికి భూములుకొనుగోలుచేసి అప్పగించాము.

ఆ విధంగా దాదాపు 5వేలఎకరాలను ఎస్సీ,ఎస్టీలు, గిరిజను లకు అందించడం జరిగింది. రెండేళ్లతన పాలనలో జగన్మోహ న్ రెడ్డి, ఎక్కడైనా ఒక్కఎకరం భూమిని కొనిచ్చాడా? దళితులభూములను ఇళ్లపట్టాల పేరుతోనిర్దాక్షణ్యంగా లాగేసుకున్నాడు. భూమి కొనివ్వకుండా ఉన్నదాన్ని లాక్కుంటారా? భూమికొనుగోలు పథకం రద్దు, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు, ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీపై నిధులివ్వడాన్ని రద్దుచేశారు.

ఆయావర్గాలకు చెందిన నిరుద్యోగయువతకు వివిధరకాల పోటీపరీక్షలకు అవసరమైన శిక్షణను ఉచితంగానేఅందించాము. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లేవారికి  ఎన్టీఆర్ విద్యోన్నతి కింద రుణాలందించాము. ఏపీ స్టడీసర్కిల్ విభాగాలను తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలలో ఏర్పాటుచేసి, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు భవిష్యత్ పై భరోసా కల్పించాం. టీడీపీ ప్రభు త్వంలో విదేశాలకువెళ్లిన విద్యార్థులు, నేడు అక్కడ ఫీజులు కట్టుకోలేకనానా అవస్థలుపడుతున్నారు.

బెస్ట్ అవైలబుల్  స్కూల్స్ పథకంకింద కార్పొరేట్ పాఠశాలల్లో ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు చదువుకునే అవకాశంకల్పిస్తే, దాన్నికూడా ఈ ముఖ్యమంత్రి రద్దుచేశాడు. అన్నీ రద్దుచేసి, ఎస్సీ,ఎస్టీలకు ఇంత, తఖర్చుపెట్టామనిచెబుతున్నారు? టీడీపీ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీలకోసం ప్రవేశపెట్టిన అనేకపథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి, వారిని బానిసలుగా మార్చాడు.

అదనంగా ఆయావర్గాలకు అవమానాలు, హత్యలు, శిరోముండనాలు, అత్యాచారాలు, ఛీత్కరింపులను కానుకగా ఇచ్చాడు. ఇది వాస్తవమోకాదో ప్రభుత్వంలోని ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన మంత్రులే సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇదిచేశాడని ధైర్యంగా చెప్పగలరా? అమ్మఒడి, విద్యాదీవెన, రైతుభరోసా లుకాదు. అదనంగా ఎస్సీ,ఎస్టీలకు ఈ ముఖ్యమంత్రి  ఏంప్రయోజనాలు కల్పించాడో  వారుచెప్పాలి. వసతి దీవెన అంటే హాస్టల్ ఫీజులుకట్టడమేగా... దానిలోకూడా ఎస్సీ,ఎస్టీలకు అన్యాయమే చేస్తున్నారు.

మిగిలినవర్గాల విద్యార్థులకేమో రూ.20వేలిస్తూ, ఎస్సీ,ఎస్టీలకు మాత్రం రూ.14వేలేచెల్లిస్తున్నారు. కేంద్రప్రభుత్వమిచ్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులనుకూడా జగన్ ప్రభుత్వం రద్దుచేసింది. విద్యాదీవెన, వసతి దీవెన రెండూ బోగస్ స్కీములే. నేరుగా తల్లులఖాతాల్లోకి డబ్బులు వేయడమేంటి? హాస్టల్ ఫీజులు, కళాశాలఫీజులను ప్రభుత్వం నేరుగా విద్యాసంస్థల యాజమాన్యాలకు చెల్లించకూడదా? తల్లిదండ్రులకు డబ్బులిస్తే, వారు సకాలంలోకళాశాలలకు చెల్లించకపోతే, ఎవరికి నష్టం?

కరోనా వల్ల కళాశాలలు, పాఠశాలలు సరిగా లేవుకాబట్టి, విద్యార్థులకు, వారితల్లిదండ్రులకు ఇంకా వాస్తవాలు బోధపపడలేదు. లేకపోతే, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు తమ విద్యాజీవితాన్ని కోల్పోయి, నానా ఇబ్బందులు పడుతుండేవారు. అన్యాయంగా, దారుణంగాఎస్సీ, ఎస్టీలను మోసంచేస్తున్నది కాక, ఇంకాసిగ్గులేకుండా వారిని ఉద్దరిస్తున్నట్లు మాట్లాడతారా? మాఇష్టమొచ్చినట్లు చేస్తాం.. మీరు అడిగేదేంట్రా.. అలా పడుండండి అని ఎస్సీ, ఎస్టీలను అనే స్థితికి ప్రభుత్వమొచ్చింది.

మైనారిటీలకు కూడా చంద్రబాబునాయుడి ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేసింది.  ఈప్రభుత్వమొచ్చాకఏంచేసిందో చెప్పమనండి? రంజాన్ తోఫా, మసీదుల మరమ్మతులకు డబ్బులివ్వడం, ఇమామ్, మౌజన్ లకు నెలనెలా జీతాలు, దుల్హన్ కింద పెళ్లిచేసుకునేవారికి డబ్బులివ్వడం చేశాము.  ఈప్రభుత్వం ఇమామ్, మౌజన్ లకు జీతాలివ్వకుండా రెండేళ్లుకాలయాపనచేసింది. 

ఈ ముఖ్యమంత్రి, మంత్రులేమో పెద్దవాడని కూడా చూడకుండా, గౌరవంలేకుండా మండలిఛైర్మన్ గా ఉన్నషరీఫ్ ను చెప్పుకోలేనివిధంగా నానామాటలని అవమానించారు.  గుంటూరు, కర్నూలు, అనంతపురం, రాజమహేంద్రవరంలలో ముస్లింవర్గాలకు చెందిన కుటుంబాలను ఎంతలావేధించి బలితీసుకున్నారో కూడాచూశాంకదా? అబ్దుల్ సలాం  అతనికుటుంబం రైలుకిందపడి ఎందుకు చనిపోయింది? ఇక గిరిజనులను ఎంతలా వేధిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సినపనేలేదు.

సత్తైనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలంలోని ఒక గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనేకాల్ మనీ వ్యాపారి గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు. దానిపై ఏ వైసీపీ నాయకుడైనా మాట్లాడాడా? కృష్ణాజిల్లా తిరువూరులో బాణావత్ లక్ష్మణరావుని బలితీసుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో యానాదివర్గానికి చెందిన మహేశ్ పై దాడిచేసి, హత్యాయత్నంచేశాడు. దోర్నాల సమీపంలోని ఒక తండాలో ఉండేకుటుంబాన్ని వేధించి, హింసించి వారిభూమిని లాక్కున్నారు. ఇలాంటి ఘటనలు అనేకము న్నాయి.

ఎస్సీల విషయంలోఎంతదారుణంగా ప్రవర్తించారు. డాక్టర్ సుధాకర్ మరణంపై ఏంసమాధానం చెబుతారు? జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే దేశద్రోహమా... జడ్జీ రామకృష్ణ పై అదేకేసుపెట్టి జైల్లోపెట్టారు. జగన్మోహన్ రెడ్డి రావాలని, ఓట్లేసి గెలిపిస్తే, ఎస్సీ,ఎస్టీలపైదేశద్రోహం కేసులుపెడతారా? జస్టిస్ నాగార్జున రెడ్డి సోదరుడు పవన్ కుమార్ రెడ్డి మర్డర్ కేసులో ముద్దాయిగాఉంటే, అతన్నికాపాడలేదని రామకృష్ణ ను వేధిస్తారా?

చిత్తూరుజిల్లా జైల్లోఉన్న రామకృష్ణను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ అనితారాణిని వేధించిందిఎవరు? డాక్టర్ సుధాకర్, చీరాలలోకిరణ్ కుమార్, శిరోముండనానికి గురైన వరప్రసాద్, మద్యంధరలపై ప్రశ్నించిన ఓంప్రతాప్ లను బలితీసుకున్నది ఈ ప్రభుత్వంకాదా?  వీటన్నింటిపై దళితవర్గాలకుచెందిన మంత్రులు ఏం సమాధానం చెబుతా రు? దళితసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, మేథావులు ఏం చేస్తున్నారు..ఎందుకుముఖ్యమంత్రిని నిలదీయరు?

చంద్రబాబునాయుడు  42శాఖలకు సకాలంలో నిధులుకేటాయించడమే కాకుండా, ఆ నిధులు సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని ప్రతిరెండునెలలకు సమీక్ష జరిపేవారు. ఈ ముఖ్యమంత్రి  సమీక్షలేమో సాక్షి మీడియాలో వార్తలకే పరిమితమవతున్నాయి. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆయాశాఖల మంత్రులసమక్షంలో ఏనాడైనా సమావేశాలు జరిగాయా? తాము రాజకీయాలు మాట్లాడటంలేదు, వాస్తవాలే చెబుతున్నాం.

ప్రభుత్వం చెబుతున్న నవరత్నాలు, రంగురాళ్లు కాకుండా, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కల్పించిన హక్కులు, అవకాశాలప్రకారం ఈప్రభుత్వం ఎస్సీ,ఎస్టీలకు ఏం న్యాయంచేసిందో, వారిని ఎంతబాగా ఉద్ధరించిందో చెప్పగలదా? దానిపై ప్రజలసమక్షంలో బహిరంగచర్చకు రాగలధైర్యం ప్రభుత్వంలో ఎవరికైనా ఉందా? చర్చకు రాలేకపోతే, కనీసం వివరణ అయినా ఇవ్వండి.

మోసపూరి త వాగ్ధానాలతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వాన్ని అందరూ గమనిస్తూనేఉన్నారు. ఎస్సీ,ఎస్టీలు జీవితాంతం బానిసలుగానేఉంటారని అనుకోకండి. వారు తిరగబడిన రోజున ముఖ్యమంత్రి, మంత్రుల పరిస్థితేమిటో వారే ఆలోచించుకోవాలి. టీడీపీ ప్రభుత్వంలో అధికారులుఎలా పనిచేశారో వారికితెలియదా? ఇప్పుడెందుకని ఏ అధికారి కూడా ముఖ్యమంత్రితో, మంత్రులతో మాట్లాడలేకపోతున్నా రు?

టీడీపీప్రభుత్వంలో అధికారులే స్వేచ్ఛగా మంత్రులతో చర్చించేవారు. వైసీపీప్రభుత్వంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. వారి మనస్సాక్షిని అడిగితే, ఈప్రభుత్వం ఆయావర్గాలకు ఏంచేసిందో అదే సమాధానం చెబుతుంది? ఎస్సీ, ఎస్టీలకు ఈప్రభుత్వంచేస్తున్న  అన్యాయంపై రాబోయేరోజుల్లో ఆయావర్గాలే తగినవిధంగా బుద్ధిచెబుతాయని హెచ్చరిస్తున్నా.