శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (13:06 IST)

మంత్రి కేటీఆర్ పబ్లిసిటీ పిచ్చి!

తెలంగాణమంత్రి కేటీఆర్ పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని టీటీడీపీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్నఎద్దేవా చేశారు. మంగళవారం జ్యోత్స్న మీడియాతో మాట్లాడుతూ.. బిర్యానీ మీద స్పందించిన కేటీఆర్ కరోనా రోగులు ప్రశ్నలకు ట్విట్టర్‌లో స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ప్రైవేటు ఆస్పత్రులను కంట్రోల్ చేయటంలో ప్రభుత్వం విఫలమైదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ మరణిస్తే కూడా స్పందించడం లేదని మండిపడ్డారు. నీలోఫర్ హెడ్ నర్స్ స్వరూపారాణి మరణిస్తే ఎవరూ స్పందించలేదన్నారు. తెలంగాణలో మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉన్నారా? అని సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు.

కేసీఆర్ సీఎం అయ్యాక ఆరు స్టాఫ్ నర్స్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారని చెప్పారు. కరోనా మరణాలపై తప్పడు లెక్కలు చూపెడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలపై గృహహింస కేసులు ఎక్కువయ్యాయని జ్యోత్స్న ఆందోళన వ్యక్తం చేశారు.