గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 7 నవంబరు 2020 (17:24 IST)

నాడు మీ హామీలన్నీ నేడు ఏమయ్యాయి? వైఎస్ జగన్ పైన దేవినేని ఉమ విమర్శ

అధికారంలో రాక ముందు ఎన్నో హామీలు గుప్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మాత్రం వేరే విధంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. పేదలకు ఇళ్లు మంజూరు విషయంలో వైసీపీ ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. 
 
21 లక్షల ఇళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసింది. అందులో 10 లక్షలకు పైగా పూర్తిచేస్తే, మీరు 17 నెలలుగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
 
ఎన్నికల ముందు పూర్తిగా ఉచితంగా ఇస్తామని, బ్యాంకు లోను సహా పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన మీ మాటలకు నేడు ఏమి సమాధానం చెబుతారు. మీరు అధికారంలోకి వచ్చాక ఎంతమంది ప్రజలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇచ్చారని దేవినేని ఉమ ప్రశ్నల వర్షం కురిపించారు.