ప్రియురాలితో భర్త రాసలీలు.... రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితక్కొట్టిన భార్య
విశాఖపట్టణంలో ఓ స్పాసెంటరులో పరిచయమైన యువతితో ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పటికే వివాహమైన ఆ భర్త.. యువతితో పరిచయమైన తర్వాత కట్టుకున్న భార్యను దూరం పెట్టసాగాడు. పైగా, ప్రియురాలితో పార్కులు, బీచ్‌లు, హోటల్స్‌లలో ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ప్రియురాలికి ఎంతో విలువైన బంగారు ఆభరణాలు కూడా తీసిచ్చాడు. తన భర్త ప్రవర్తనలో మార్పురావడాన్ని గమనించిన భార్య.... అతనిపై ఓ కన్నేసింది. ఈ క్రమంలో భర్తను ఫాలో కాసాగింది. ఈ క్రమంలో తాజాగా తన ప్రియురాలితో పడక గదిలో రాసలీలల్లో మునిగిపోయివున్న సమయంలో భార్య.. తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత భర్తతో పాటు.. అతని ప్రియురాలిని వారంతా కలిసి చితక్కొట్టారు. పరుష పదజాలంతో దూషించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుది.