శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (09:50 IST)

భర్తను పిజ్జా కొనివ్వమంది.. పెళ్లైన రెండో రోజే చెక్కేసింది..

భర్తను పిజ్జా కొనివ్వమని అడిగింది.. షాపులోంచి బయటకొచ్చేసిరికి చెక్కేసింది. పెళ్లైన మరునాడే భర్తకు ఝలక్ ఇచ్చింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా కీసర మండలం ఆర్‌ఎల్

భర్తను పిజ్జా కొనివ్వమని అడిగింది.. షాపులోంచి బయటకొచ్చేసిరికి చెక్కేసింది. పెళ్లైన మరునాడే భర్తకు ఝలక్ ఇచ్చింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా కీసర మండలం ఆర్‌ఎల్‌ నగర్‌‌లో పాలవ్యాపారి మాదినేని తిరుపతయ్య (23)తో కడప జిల్లా మైదుకూరుకు చెందిన రాజపుత్ర శివమల్లేశ్వరి (19)కి ఈ నెల ఒకటో తేదీన పెద్దలు వివాహం చేయించారు. 
 
వివాహం జరిగిన వెంటనే ఆమెను తిరుపతయ్య హైదరబాదుకు తీసుకొచ్చాడు. మరుసటి రోజు సినిమాకు తీసుకెళ్లమని భార్య కోరడంతో సరేనని తీసుకెళ్లాడు. సినిమా పూర్తయిన తర్వాత పిజ్జా కావాలని కోరింది. దీంతో భార్య షాప్ బయట ఉంచి.. పిజ్జా తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఆమె ఓ ఆటోలో వెళ్లిపోతుండటం కనిపించింది. దీంతో ఆమె కోసం గాలింపు చేపట్టాడు. దొరకకపోయేసరికి తిరుపతయ్య కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.