శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (06:50 IST)

ఉపవాసం చేయలేదని భార్యను కత్తితో పొడిచి...

భార్య ఉపవాసం చేయలేదనీ భార్యను కత్తితో పొడిచి.. తాను కూడా భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

భార్య ఉపవాసం చేయలేదనీ భార్యను కత్తితో పొడిచి.. తాను కూడా భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీకి చెందిన జశ్వింధ‌ర్ సింగ్ అనే వ్య‌క్తికి భార్య‌, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. పుట్టింట్లో ఉన్న భార్య‌ను చూసేందుకు వ‌చ్చిన జ‌శ్వింధ‌ర్ సింగ్.. త‌న భార్య‌ను బంగ్లాపైకి తీసుకెళ్లి 'క‌ర్వా చౌత్ ఉప‌వాసం' చేశావా? అని అడిగాడు. ఆమె చెయ్య‌లేద‌ని చెప్పింది.
 
దీంతో, అక్కడే భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ గొడవపడ్డారు. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన భ‌ర్త.. క‌త్తితో త‌న భార్య‌ను పొడిచి, వెంట‌నే బంగ్లా నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ప్ర‌స్తుతం అత‌డి భార్య ఢిల్లీలోని బీఎస్ఏ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది.