ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (11:47 IST)

Bapatla: భర్త తలపై కర్రతో కొట్టి ఉరేసి చంపేసిన భార్య

Wife
Wife
బాపట్ల జిల్లా రేపల్లెలో దారుణం జరిగింది. నిజాంపట్నం మండలం కొత్త పాలెంలో నడిరోడ్డుపై భర్త అమరేంద్రను భార్య హత్య చేసింది. మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో భర్త తలపై కర్రతో కొట్టి తాడుతో ఉరేసింది. అక్కడికక్కడే అమరేంద్ర మృతి చెందాడు. 
 
గ్రామస్తుల ఫిర్యాదుతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరేంద్ర భార్యను తరచూ వేధించేవాడని.. ఆ వేధింపులు తాళలేక భార్య ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.