పదవి, పెట్టుకున్న విగ్గుతో సహా రఘురామరాజుకు త్వరలో...: వైసీపీ ఎంపీ సురేష్  
                                       
                  
                  				  ‘రఘురామకృష్ణరాజు భవిష్యత్తు ఏమిటో త్వరలోనే తెలుస్తుంది. ఎవరితో ఆడుకోకూడదో వారితోనే ఆటలు ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వారి ఆట ఎలా ఉంటుందో.. అతి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ రూపంలో తెలుస్తుందని హెచ్చరించారు వైసీపీ ఎంపీ నందిగామ సురేష్. పదవి విషయంలోగానీ, తాను పెట్టుకున్న విగ్గు విషయంలోగానీ రఘురాజు కచ్చితంగా తన ఒరిజనల్ స్టేజికి వస్తారు అన్నారు సురేష్.
				  											
																													
									  
	 
	ప్రతి రోజూ ఢిల్లీ చెట్టు కింద ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీని, ముఖ్యమంత్రి జగన్ గారిపై విమర్శలు చేసి చివరికి జోహార్ సీఎం అంటూ నీతినియమాలు లేకుండా, రాజకీయ విలువలు పాటించకుండా పాతాళానికి దిగజారాడు. 
				  
	 
	అసలు రఘురామకృష్ణరాజుకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో.. ఏ బ్యాంకులను లూటీ చేశాడో ఇవన్నీ బయటకు రావాలి. వీటన్నింటినీ సర్దుకోవడానికే ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారు’ అని సురేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.