శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 19 ఆగస్టు 2020 (16:40 IST)

జెసి ప్రభాకర్ రెడ్డికి కరోనావైరస్ సోకడానకి కారణం ఎవరు? సీఎంగారూ ఇది పద్ధతి కాదు: ఎవరు?

కక్షలు, కార్పణ్యాలు కార్ఖానాగా రాష్ట్ర ప్రభుత్వం మారిందన్న అపప్రద మీపై వస్తోందంటూ, మరో సారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై “కరోనా” కేసు పెట్టి ఆయనకి “కరోనా” అంటించేలా చేయడం ఎంతవరకు న్యాయం అన్నారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విమర్శలు చేశారు ఆయన.
 
తాడిపత్రిలో ఆ రోజు విధులు నిర్వహిస్తున్న సీఐ కూడా ఆ ప్రాంతంవాడు కాదని తెలిసింది. అందువల్ల ఆ అధికారి ఏ కులంవాడో ప్రభాకర్ రెడ్డికి ఆ క్షణంలో ఎలా తెలుస్తుంది? అని నిలదీశారు. సీఎం గారూ చట్టాలని దుర్వినియోగ పరుస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించండి, అవసరమైన ఖర్చులు ఆయనే భరిస్తారు.
 
జేసీ ప్రభాకర్రెడ్డికి ఒకవేళ ఏదైనా జరిగితే అది ప్రభుత్వ ప్రతిష్టకు మంచిది కాదు అన్నారు ఈ రెబల్ ఎంపీ. “కరోనా” కాలంలోనే ప్రభుత్వం బ్రాందీ షాపులు తెరిచింది... అధికార పార్టీ వాళ్ళు అనేక ర్యాలీలు చేశారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాత్రం కేసులు పెట్టారు. కక్షలు కార్పణ్యాలకు ముఖ్యమంత్రి దూరంగా ఉండాలని నా విజ్ఞప్తి అన్నారు రఘురామకృష్ణ రాజు