మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 మే 2017 (09:54 IST)

ప్రేమ పేరుతో వాడుకున్న ప్రియుడు.. యాసిడ్ తాగించి చంపేసిన ప్రియురాలు... 24 గంటల్లో పగతీర్చుకున్న వైనం!

ఓ కామాంధుడు ప్రేమ పేరుతో ఓ యువతిని నాలుగేళ్ళ పాటు శారీరకంగా వాడుకున్నాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రియుడిపై మొదటి ప్రియురాలు పగ తీర్చుకోవాలని కంకణం కట్టుకుంది. అంత

ఓ కామాంధుడు ప్రేమ పేరుతో ఓ యువతిని నాలుగేళ్ళ పాటు శారీరకంగా వాడుకున్నాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రియుడిపై మొదటి ప్రియురాలు పగ తీర్చుకోవాలని కంకణం కట్టుకుంది. అంతే... మరోమారు శారీరకంగా కలుద్దామని పిలిచి... యాసిడ్ తాగించి చంపేసింది. అదీకూడా ఆ యువకుడికి వివాహమైన 24 గంటల్లోనే తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు గ్రామంలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తాడికొండ మండలం పాములపాడుకు చెందిన ఇలియాజ్‌ (24) అనే యువకుడు గుంటూరులోని జేకేసీ కళాశాలలో ఐదేళ్ల క్రితం డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. ఆసమయంలోనే స్థానిక అభ్యుదయ కళాశాలలో చదువుకునే ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమ పేరుతో ఆమెను నాలుగేళ్ళ పాటు అన్ని విధాలుగా వాడుకున్నాడు. తర్వాత ఆమెను వదిలేసి పెదకాకానికి చెందిన రోజ్‌ మేరీ అనే యువతిని ప్రేమించాడు. పెద్దలకు విషయం తెలిసి 22వ తేదీ సోమవారం స్థానిక పాములపాడు మసీదు సమీపంలో వారిద్దరికీ వివాహం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న మొదటి ప్రేయసి... అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించి, ఓ ఎత్తు వేసింది. 
 
అప్పటికే వివాహ తంతు పూర్తికావడంతో సంప్రదాయం ప్రకారం కొత్త దంపతులిద్దరూ పెదకాకానిలోని అత్తవారింటికి వెళ్లారు. ఇలియాజ్ అత్తవారింటికి చేరుకోగానే... మోసపోయిన ప్రియురాలు ఫోన్ చేసింది. తాను వెనిగండ్ల దళితవాడలో ఉన్నానని, మనమిద్దరం తీయించుకున్న ఫోటోలు ఇచ్చేయాలని కోరింది. దీంతో ఇలియాజ్ మధ్యాహ్నం అత్తవారింటి నుంచి ఆమెను కలిసేందుకు ఒంటరిగా బైక్‌పై ఆమె వద్దకు వెళ్లాడు. తన వద్దకు ఇలియాజ్ రాగానే.. చివరిసారిగా శారీరకంగా కలుసుకుందామని చెప్పి.. ఓ గదిలోకి తీసుకెళ్లింది. అక్కడ అతనితో సన్నిహితంగా మెలిగినట్టు నటిస్తూనే కూల్‌డ్రింక్ పేరుతో యాసిడ్ తాగించింది. ఆ తర్వాత యాసిడ్‌తో దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇలియాజ్‌ను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. ఈ విషయాన్ని ఇలియాజ్ సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది.
 
దీంతో హుటాహుటిన ఇలియాజ్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోగా, తాను ప్రేమించిన యువతి తనపై యాసిడ్ దాడి చేసిందని, తాను ఎక్కువ సేపు బతకనని చెప్పాడు. దీంతో అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించే ప్రయత్నంలో ఉండగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీనిపై ఇలియాజ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ ఘటనలో అతని ప్రేయసితో పాటు మరికొందరు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మోసపోయిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.