మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:15 IST)

గుడికెళ్లిన యువతి అదృశ్యం.. ఏమైందో?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇంటా బయటా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మహిళ బయటికి వెళ్తేనే ఆమెపై జరిగే దాడులు ఒక ఎత్తైతే.. మహిళలను కిడ్నాప్ చేసి అకృత్యాలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతోంది. 
 
తాజాగా హైదరాబాదులో గుడికెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. లాలాగూడ ఎస్సై రవీందర్‌ కథనం ప్రకారం.. నార్త్‌లాలాగూడ శాంతినగర్‌కు చెందిన పి.శారద కుమార్తె పి.కల్పలత(24) డిగ్రీ చదువుతోంది. 
 
గత నెల 22న గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయింది. తిరిగి రాలేదు. తల్లి బంధువులు, స్నేహితుల ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.