శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (06:19 IST)

బాబు కుటుంబం హత్యకు వైసీపీ ప్రభుత్వం కుట్ర: బుద్దా వెంకన్న

చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులను అంతమొందించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.

చంద్రబాబుపై లోకేశ్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే పోలీసులకు బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. కలియుగ అభిమన్యుడు లోకేష్‌పై 1000 మంది వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు లోకేశ్‌కు భద్రత తగ్గింపుపై కేంద్రానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అంత భద్రత అవసరమా అని నిలదీశారు.

వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నోరు అదుపులో పెట్టుకోవాలని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.