మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జులై 2020 (12:24 IST)

చరిత్రలో చిరిగిన కాగితం బాబు, ఆయన తీరు రాజకీయాలకే మచ్చ: వైసీపీ

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా వారు మండిపడ్డారు.

‘‘చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు. వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడు’’ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
రాజకీయాలకే మచ్చ..
‘తెనాలి ప్రభుత్వ డాక్టర్‌ మరణాన్ని చంద్రబాబు వాడుకుంటున్న తీరు రాజకీయాలకే మచ్చ. ఆయన మెదడు కుళ్లిపోయిందనే విషయాన్ని ఆయనే బయట పెట్టుకున్నారు. విపత్తులను కూడా రాజకీయం చేసే పచ్చి స్వార్థపు మనిషి చంద్రబాబు’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.