గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 25 నవంబరు 2021 (12:25 IST)

వైసిపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు తృటిలో తప్పించుకున్నారు, లేకుంటే?

వైసిపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. రాయలచెరువు పరిశీలన కోసం ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి గౌతంరెడ్డితో పాటు తిరుపతి ఎంపి గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిలు కలిసి బోటులో బయలుదేరారు. 

 
ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్న బోటు అదుపుతప్పి చెరువు గట్టును ఢీకొంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు బోటులో ఉన్న ప్రజాప్రతినిధులు. అయితే అదృష్టవశాత్తు అదుపుతప్పినా బోటు స్థిరంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

 
మొత్తం మీద రాయలచెరువు పరిశీలన పేరుతో బోటు షికారు చేద్దామనుకున్న వైసిపి నేతల ప్రాణాలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడినట్లయ్యింది. దీంతో బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు వైసిపి నేతలు.