శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2024 (08:58 IST)

టీడీపీలో చేరేందుకు సిద్దమైన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ

ysrcp flag
మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 8 తర్వాత ఆయన పార్టీ మారే అవకాశం ఉంది. ‘సిద్దం’ సమావేశానికి తాను హాజరు కాబోనని ఇప్పటికే స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్‌ జోక్యంపై వసంతకృష్ణ ప్రసాద్‌ గతంలోనే సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని సీఎం పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.
 
మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే నారా లోకేష్‌తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్‌ను ఇన్‌ఛార్జ్‌గా వైసీపీ శుక్రవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని, పనులు పూర్తి చేసిన పార్టీ నాయకులు తమ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.