శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 1 ఆగస్టు 2019 (11:47 IST)

పవన్‌కు ఉన్నది కూడా పోయినట్లుందే: వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

అనంతపురం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి.వెంకట సిద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్‌కి లేదని విమర్శించారు. 
 
రెండు చోట్లు పోటీ చేస్తే ఒక్క చోట కూడా పవన్ గెలవలేకపోయాడని, పోటీ చేసిన 140 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి సీఎం జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 
 
జనసేన తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గెలిచారని ఆయనకు కూడా పార్టీలో మర్యాద ఇవ్వడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్‌కు జ్ఞానోదయం అవుతుందని అనుకుంటే ఉన్నది కూడా పోయినట్లుందంటూ సెటైర్లు వేశారు.