సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 24 జులై 2024 (12:12 IST)

జగన్ ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు వైకాపా ఎమ్మెల్సీలు!!

jagan
ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా నశించిపోయాని ఆరోపిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా, నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, మొత్తం 38 మంది ఎమ్మెల్సీల్లో ఇద్దరు మాత్రం ఈ ధర్నాకు దూరంగా ఉన్నారు. ఆ ఇద్దరూ బుధవారం జరిగిన శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. దీంతో ఈ ఇద్దరు శాసనసభ్యులు వైకాపాను వీడటం తథ్యమని తేలిపోయింది. 
 
ముగిసిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో అధికార మార్పిడి జరిగింది. వైకాపా అధికారాన్ని కోల్పోగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నాయకులే టార్గట్‌గా దాడులు, హత్యలు జరుగుతున్నాయని జగన్ తెగ గగ్గోలు పెడుతున్నారు. కేవలం నెల రోజుల కూటమి ప్రభుత్వంలో 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ ఆయన ఆరోపిస్తూ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఇదే కారణంతో ఆయన బుధవారం ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రధాని, రాష్ట్రపతిలను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ధర్నాకు ఇద్దరు ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు. వీరిలో తూమాటి మాధవ రావు,వంకా రవీంద్ర మాత్రం హస్తినకు వెళ్లలేదు కాద.. శాసన మండలి సమావేశాలకు హాజరయ్యారు. ఇపుడు ఇది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నేతల్లో కూడా వీరి అంశం చర్చకుదారితీసింది.