శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 31 ఆగస్టు 2020 (12:44 IST)

చంద్రబాబు చిన్న మెదడు చితికింది, వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఎన్ని సీట్లో తెలుసా? రోజా కామెంట్స్

ఇంకా ఎన్నికలకు నాలుగు సంవత్సరాల సమయం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో చెప్పారు రోజా. టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దళితులను రెచ్చగొట్టే కార్యక్రమం పెట్టుకున్న టిడిపి నేతలను ఆ దళితులే ఓడిస్తారని.. ఒక్క సీటు కూడా వచ్చే ఎన్నికల్లో టిడిపి రాదన్నారు రోజా. 
 
చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లిపోయిందని విమర్సించారు. తిరుగులేని మెజారిటీతో గెలిచిన వైసిపిని చూసి ఇప్పటికీ చంద్రబాబు ఓర్వలేక పోతున్నారన్నారు. కరోనాకు భయపడి ఎక్కడికో పారిపోయి చంద్రబాబు దాక్కున్నాడని.. మరోసారి వైసిపి గురించి ఇష్టమొచ్చినట్లు బాబు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎప్పుడూ వెనుకబడిన తరగతులను అభివృద్థి చేయడం వైపే ఉంటుందన్నారు. 
 
అనవసరంగా బురదజల్లే ప్రయత్నం మంత్రి పెద్దిరెడ్డిపై చేస్తున్నారని, ఎక్కడో ఏదో జరిగితే పెద్దిరెడ్డే అందుకు కారణమని టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. దళితులకు మొదటి స్థానం ఇచ్చిన గొప్పతనం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. 
 
నీతిమాలిన రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారు. టిడిపి నేతలకు అబద్ధాలు చెప్పడం తప్ప నిజం మాట్లాడడం తెలియదన్నారు. పెందుర్తిలో దళిత మహిళ చీర విప్పి కొట్టింది టిడిపి నాయకులని, ఎవరైనా ఎస్సిగా పుడతారా అంటూ అప్పట్లో టిడిపిలో ఉన్న ఒక మంత్రి మాట్లాడారని, అలాగే మంత్రిగా ఉన్న ఆదినారాయణ.. దళితులు స్నానం కూడా చేయరు అన్న విషయాన్ని రోజా గుర్తు చేశారు.
 
దళితులకు అండగా ఉంటూ దళితులను అన్ని విధాలుగా అభివృద్థి చేస్తున్నామని.. కులాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తే చంద్రబాబుకు దళితులే బుద్ధి చెబుతారని.. మరోసారి ఇలాంటీ చీప్ ట్రిప్స్ ప్లే చేయొద్దన్నారు రోజా.