సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 29 జూన్ 2024 (12:56 IST)

పోలవరం అప్పుడు అర్థం కాలేదన్నారు, ఇప్పుడెలా అర్థమైంది రాంబాబూ? నెటిజన్ల ట్రోల్స్ (video)

Ambati Rambabu
పోలవరం ప్రాజెక్టు గురించి శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం సమర్పించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును పట్టించుకోలేదనీ, దీనితో భారీగా నష్టం వాటిల్లిందని అన్నారు. ఆ సందర్భంగా గత ఐదేళ్లుగా అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటనలతో పాటు మాజీమంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు గురించి చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలను ప్రదర్శించారు. ఆ వీడియోలను చూపిస్తూ సీఎం చంద్రబాబు పగలబడి నవ్వారు. పోలవరం ప్రాజెక్టు వీరికి హాస్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.
 
దీనిపై మాజీమంత్రి అంబటి రాంబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాపర్ డయాఫ్రమ్ కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమనీ, ఓ వీడియోను చూపిస్తూ వివరించారు. రాంబాబు పెట్టిన వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. మీరు అధికారంలో వున్నప్పుడు అర్థం కాదు.. పోయాక అర్థమవుతుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు.