బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (22:33 IST)

సెల్ఫీల కోసం జుట్టు పట్టుకున్నారు.. ఎక్కడ?

selfie
సెల్ఫీల కోసం కొంద‌రు యువ‌తుల గొడ‌వ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న తాజాగా గుంటూరులోని గాంధీ పార్కులో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో కొంత‌మంది యువ‌తులు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీప‌డ్డారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నగరంలో ఇటీవల కొత్తగా గాంధీ పార్క్‌ను ప్రారంభించారు. అక్కడ ప్ర‌త్యేకంగా సెల్ఫీల కోసం ఓ లొకేషన్‌ను ఏర్పాటు చేశారు. 
 
ఈ నేప‌థ్యంలో కొంద‌రు యువ‌తులు, మ‌హిళ‌లు సెల్ఫీలు పోటీపడ్డారు. చిన్న గొడ‌వ‌గా మారిన ఈ సెల్ఫీల వివాదం కాస్త ఇరువ‌ర్గాల వారు జుట్లు ప‌ట్టుకుని కొట్టుకునే స్థాయి వ‌ర‌కూ వ‌చ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.