కొత్త ప్రియుడిపై పాత ప్రియుడితో కత్తితో దాడి చేయించిన ప్రియురాలు.. ఎక్కడ?
తాను ప్రేమిస్తున్న కొత్త ప్రియుడిపై చిన్ననాటి పాత ప్రియుడిపై ఓ ప్రియురాలు కత్తితో దాడి చేయించింది. ఈ షాకింగ్ ఘటన తిరుపతిలో జరిగింది. కొంతకాలంగా ప్రేమిస్తున్న తన క్లాస్‌మేట్ వదిలించుకునే పనిలో భాగంగా, సినిమా చూద్దామని అతన్ని థియేటర్‌కు పిలిపించి... అప్పటికే అక్కడ వేచిచూస్తున్న పాత ప్రియుడితో కత్తితో దాడి చేయించింది. శనివారం తిరుపతిలో ఈ ఘటన వివరాలను తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ నాగేంద్ర బాబులు మీడియాకు వివరించారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పల్లిగుంటిపల్లెకు చెందిన లోకేశ్ తిరుపతిలో పారామెడికల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన సహచర విద్యార్థినితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. శనివారం సినిమాకు వెళ్దామని ప్రియుడికి చెంపిన యువతి.. రెండు టిక్కెట్లు బుక్ చేసింది. లోకేశ్ బైకుపై థియేటర్‌కు రాగా, ఆ యువతి మాత్రం ఆటోలో వచ్చింది. ఇద్దరూ థియేటర్ లోనికి వెళ్లి తమతమ సీట్లలో కూర్చొన్నారు.
కొంతసేపటికి తిరుపతి జిల్లా తడ మండలం అండగుండాలకు చెందిన కార్తీక్ ముందు వరుసలో ఉన్న లోకేశ్ పొత్తికడుపులో కత్తితో పొడిచాడు. ఆ వెంటనే కార్తీక్, యువతి థియేటర్ నుంచి బయటపడి బైకుపై పారిపోయాడు. ఈ లోగా లోకేశ్ వాష్‌రూమ్‌కు వెళ్లి గాయాన్ని కడుక్కుంటుండగా, థియేటర్ సిబ్బంది గుర్తించి రుయా ఆస్పత్రికి తరలించారు. తనపై దాడిని దాచిపెట్టిన లోకేశ్.. కిందపడటంతో గాయమైందని వైద్యులకు చెప్పాడు. అయితే, అది కత్తిగాయంగా భావించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి విచారించడంతో అసలు విషయం వెల్లడైంది. ఆ తర్వాత హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు.
ఈ దాడికి ఆ యువతి పక్కా వ్యాహాన్ని రచించింది. తనకు బంధువైన కార్తీక్‌తో ఆ యువతి చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంది. పదో తరగతి వరకు చదువుకున్న కార్తీక్ ప్రస్తుతం జులాయిగా తిరుగుతున్నాడు. అతనితో నిత్యం ఆ యువతి ఫోనులో మాట్లాడుతుంది. మరోపక్క క్లాస్‌మేట్ లోకేశ్‌తో చనువుగా ఉంటుంది. పైగా, ఒకరి విషయాలు మరొకరితో పంచుకునేది. దీంతో వారిమధ్య కక్షలు పెరిగాయి. శుక్రవారం తిరుపతిరాగా, ఇద్దరూ కలిసి లోకేశ్‌పై దాడికి పథకం వేసి దాడి చేశఆరు. తనకు ముందు వరుసలో లోకేశ్, వెనుక వరుసలో కార్తీక్ వచ్చేలా ఆ యువతి టిక్కెట్లు బుక్ చేయడం గమనార్హం. కాగా, ఈ దాడి తర్వాత కార్తీక్‌తో కలిసి ఆ యువతి శ్రీకాళహస్తి వైపు బైకుపై వెళ్ళిపోయింది.