గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (09:57 IST)

జగన్‌కు సీఎంగా మరో రెండు దఫాలు అవకాశం ఇవ్వాలి : హీరో సుమన్

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డికి మరో రెండు దఫాలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వాలని హీరో సుమన్ అన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులు వరుసగా రెండు, మూడు సార్లు సీఎంలు అయ్యాయరని, అందువల్ల సీఎం జగన్‌కు మరో రెండుసార్లు ఛాన్సివ్వాలని ఆయన కోరారు. 
 
విజయవాడలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వులతో జీవిస్తున్నారన్నారు. 
 
ముఖ్యంగా, వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు పేదల్లో చిరునవ్వులు నింపాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే జగన్ మరో రెండుసార్లు ముఖ్యమంత్రి కావాలని ఆయన చెప్పారు. ఒకే వ్యక్తికి మూడుసార్లు సీఎంగా అవకాశం ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. 
 
ఇకపోతే, సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ పరిశ్రమ మొత్తం కట్టుబడివుంటామని చెప్పారు. సినీ పరిశ్రమ బాగుండటానికి వైకాపా ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ చేసిందని చెప్పారు.