సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 2 జులై 2022 (23:38 IST)

డియర్ హర్షా, నీది అద్భుతమైన జర్నీ: కుమార్తె ఎదుగుదలపై సీఎం జగన్

Harsha
తన కుమార్తె హర్షారెడ్డి పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ కంప్లీట్ చేయడంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేసారు. కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సతీసమేతంగా జూన్ 28న పారిస్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన కుమార్తె హర్షాకి విషెస్ తెలిపారు.

 
డియర్ హర్షా... నీ ఎదుగుదలను చూడటం అద్భుతంగా వుంది. దేవుడు దయతో నీవు ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసావు. నిన్ను చూసి నాకెంతో గర్వంగా వుంది. నీకు దేవుడు ఎల్లవేళలా మంచి చేయాలని కోరుకుంటున్నాను అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.