గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జులై 2022 (18:47 IST)

ఆదోనిలో వైఎస్ జగన్ పర్యటన.. హెలిప్యాడ్‌ ఏర్పాటు

ys jagan
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదోనిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈనెల 5వ తేదీన ఆదోనిలోని మున్సిప‌ల్ క్రీడా మైదానం వేదిక‌గా విద్యార్థుల‌కు "జ‌గ‌న‌న్న విద్యా కానుక" కిట్లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పంపిణీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జ‌య‌రాం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదోనికి రావడం ఎంతో శుభసూచికమన్నారు. సీఎం రాకతో పశ్చిమ ప్రాంతమైన ఆదోని అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆదోని పట్టణంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నారు.