సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (13:35 IST)

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు

venkaiah naidu
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి తన పుట్టిన రోజు వేడుకలను జూలై ఒకటో తేదీ శుక్రవారం జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఆయనకు అనేక మంది రాజకీయ ప్రముఖులు బర్త్ డే విసెష్ చెబుతున్నారు. ఇలాంటి వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకరు. వెంకయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
 
"మీ హుందాతనం, సమాజం, దేశంపట్ల మీకున్న ప్రేమ, ప్రజల పట్ల మీకున్న అంకితభావం రేపటి తరానికి ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దేశానికి సేవలు అందించాలని ఆయన విడుదల చేసిన పుట్టినరోజు సందేశంలో పేర్కొన్నారు.