సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (18:10 IST)

ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ

president bhavan
ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జూలై 7వ తేదీన నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. 19వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వీటిని జూలై 20వ తేదీన పరిశీలిస్తారు. ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే జూలై 22వ తేదీవరకు గడువు ఇచ్చారు. ఆగస్టు 6వ తేదీన పోలింగ్ ఉంటుంది. 
 
అదే రోజు కౌంటింగ్ చేపడుతారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ సాగుతుంది. ఆ తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు, ప్రస్తుత ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కొత్తవారిని ఎన్నుకోనున్నారు.