మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2022 (16:54 IST)

వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కార్లు టైర్లు పేలిపోయాయి..

ys vijayamma
వైకాపా మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయమ్మకు పెను ముప్పు తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని తిరిగి ఇంటికి బయలుదేరారు. 
 
ఈ కారు వేగంగా వెళుతుండగా, ఒక్కసారిగా టైర్లు పేలిపోయాయి. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలు జిల్లా గుత్తి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఆమె మరో కారులో వెళ్లిపోయారు.