గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (18:30 IST)

చిన్నాన్న హత్యకు ఆస్తుల గొడవలు కాదు... వివేకా వ్యక్తిత్వ హననంపై షర్మిల మండిపాటు

sharmila
తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి చాలా మంచి మనిషి అని, ఆయన హత్యకు ఆస్తులు వ్యవహారం కానేకాదని వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఆయన గురించి కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వ్యక్తిత్వ హననం చేస్తున్నాయని దీన్ని తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. మన మధ్య లేని వ్యక్తి గురించి, సంజాయిషీ ఇచ్చుకోలేని వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం ఎందుకని ఆమె పరోక్షంగా తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా సంస్థలు, ఆయనకు అండగా ఉన్న ఎలక్ట్రానిక్ సంస్థలపై మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి చాలా గొప్ప వ్యక్తి. మంచి ప్రజా నేత. ప్రజలందరికీ ఎపుడూ అందుబాటులో ఉంటూ సేవ చేశారని చెప్పారు. తన హోదాతో నిమిత్తం లేకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి తరగతుల్లో రైలులులో ప్రయాణిస్తూ ప్రజల కోసం వెళ్లేవారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి గురించి కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తుండటం దారుణమన్నారు. మనమధ్యలేని వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ఇలాంటి కథనాలతో ఆయా సంస్థలు విలువ పోగొట్టుకోవద్దని హితవు పలికారు. 
 
చిన్నాన్న ఆస్తులన్నీ కుమార్తె సునీత పేరుమీదే రాయించారని షర్మిల చెప్పారు. అన్ని ఆస్తులూ సునీత పేరు మీదే ఉన్నాయని, ఒకటి, అర ఆస్తులను కూడా సునీత పిల్లల పేరిట వీలునామా రాశారని తెలిపారు. హత్యకు ఆస్తులు కారణం కాదని, ఒక వేళ ఆస్తులే హత్యకు కారణమైతే చిన్నాన్ను కాకుండా సునీతను తొలుత చంచాలని అన్నారు.