గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 17 మార్చి 2019 (11:26 IST)

వైకాపా లోక్‌సభ అభ్యర్థులు వీరే... నెల్లూరులో మేకపాటికి షాక్.. ఆదాలకు టిక్కెట్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వైకాపా అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మొత్తం 25 ఎంపీ స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి జగన్ షాకిచ్చారు. ఆయనకు మొండిచేయి చూపించి... ఇటీవల తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే, 
 
1. శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాసరావు
2. విజయనగరం - బెల్లాని చంద్రశేఖర్‌
3. అరకు - గొడ్డేటి మాధవి
4. విశాఖపట్నం - ఎంవీవీ సత్యనారాయణ
5. అనకాపల్లి -  డాక్టర్‌ సత్యవతి
6. కాకినాడ - వంగా గీత
7.  అమలాపురం - చింతా అనురాధ
8. రాజమండ్రి - మర్గాని భరత్‌
9. నరసాపురం - రఘురామ కృష్ణంరాజు
10. ఏలూరు - కోటగిరి శ్రీధర్‌
11. మచిలీపట్నం - బాలశౌరి
12. విజయవాడ - పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)
13. గుంటూరు - మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి
14. నరసారావుపేట - లావు కృష్ణదేవరాయలు
15. బాపట్ల - నందిగం సురేశ్‌
16. ఒంగోలు - మాగుంట శ్రీనివాస్‌ రెడ్డి
17. నంద్యాల - పి.బ్రహ్మానంద రెడ్డి
18. కర్నూలు - డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌
19. అనంతపురం - తలారి రంగయ్య
20. హిందుపురం - గోరంట్ల మాధవ్‌
21. కడప - వైఎస్‌.అవినాష్‌ రెడ్డి
22. నెల్లూరు - ఆదాల ప్రభాకర్‌రెడ్డి
23. తిరుపతి - పల్లె దుర్గాప్రసాద్‌
24. రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
25. చిత్తూరు - నల్లకొండగారి రెడ్డప్ప.