ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (22:39 IST)

టీడీపీ తీర్థం పుచ్చుకున్న సి. రామచంద్రయ్య.. జగన్‌పై ఫైర్

CBN
CBN
వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం నాడు టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఆయన నివాసంలో రామచంద్రయ్య కలిసి పసుపు కండువా కప్పుకున్నారు. 
 
సి.రామచంద్రయ్యతో పాటు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకనాథ రెడ్డి, పలువురు కడప జిల్లాకు చెందిన కీలక నేతలు సైకిలెక్కేశారు.
 
టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన సి. రామచంద్రయ్య.. ఆంధ్రప్రదేశ్ మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారని ఫైర్ అయ్యారు. ప్రజల చర్మం వలిచి పన్నులు కట్టిస్తే తప్ప జగన్ చేసిన అప్పులు తీరవన్నారు.
 
కాగా.. గతంలో కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం అయిన తర్వాత సి. రామచంద్రయ్య ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఇప్పుడు టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. రామచంద్రయ్య తొలుత చార్టర్డ్ అకౌంటెంట్. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎదగగలిగారు. ప్రజారాజ్యం పార్టీలో చేరిన పెద్ద నాయకుల్లో రామచంద్రయ్య ఒకరు. జగన్ సొంత జిల్లా కడపకు చెందిన సి. రామచంద్రయ్య కూడా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.