మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2019 (14:42 IST)

ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్ళిపోవడం రాజకీయాలు కాదు..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైనప్పటికీ సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడంటూ పవన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు. 
 
'ఎన్నికల్లో ప్రజలు పొర్లించి కొట్టినంత పనిచేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడు. యాక్టరును చూద్దామని నలుగురూ పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం కాదు. ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లిపోవడం అంతకంటే కాదు' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.