గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (09:11 IST)

వైకాపాలో చేరి తప్పు చేశా.. సునీత కాళ్లపై పడిన కార్యకర్త

tdp cadre
అమ్మా.. నన్ను క్షమించు.. వైకాపాలో చేరి తప్పు చేశాను అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై ఓ కార్యకర్త పడి ప్రాధేయపడ్డారు. టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. ఇందులోభాగంగా, సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో పరిటాల సునీత ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది.
 
ఈ సందర్భంగా మచ్చుమర్రి గ్రామానికి చెందిన రామాంజనేయులు మాజీ మంత్రి సునీత కాళ్లపై పడ్డారు. అమ్మా.. వైకాపాలో చేరి తప్పు చేశాను. నన్ను క్షమించు అమ్మా అంటూ వేడుకున్నారు. 
 
వైకాపాలో చేరి తప్పు చేశానని, తనను మళ్లీ టీడీపీలో చేర్చుకోవాలంటూ ప్రాధేయపడ్డారు. దీంతో రామాంజనేయులను ఆమె పైకిలేపి... మీలాంటి వారికి పార్టీలో ఎప్పటికీ స్థానం ఉంటుందని భరోసా ఇస్తూ, అక్కడే టీడీపీ కండువా కప్పి.. టీడీపీ సభ్యత్వం కల్పించారు.