1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-11-2022 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల శుభం...

Astrology
మేషం :- ఉద్యోగస్తులు మార్పులకై చేయుప్రయత్నాలు కలిసిరాగలవు. ఇంటి రుణములు కొన్ని తీరుస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విందుల్లో పరిమితి పాటించండి. బంగారు వ్యాపారులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
వృషభం :- హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఉన్నతంగా ఎదగాలనే మీ లక్ష్యానికి చేరువవుతారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గొప్పగొప్ప అవకాశాలు మీ దరిచేరతాయి.
 
మిథునం :- కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. పెద్దలతో పట్టింపులు సంభవిస్తాయి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ప్రభుత్వమూలక ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం.
 
కర్కాటకం :- రాజకీయనాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. మీ సంతానం మొండి వైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
సింహం :- దైవ దర్శనానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. గృహోషకరణాలు, వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలదు. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
 
కన్య :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. సోదరి, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. 
 
తుల :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.
 
వృశ్చికం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఊహగానాలతో కాలం వ్యర్థం చేయక సతాకాలంను సద్వినియోగం చేసుకోండి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం.
 
ధనస్సు :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు, ఖర్చులకు సంబంధించి వ్యూహాలు అమలు చేస్తారు. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకుమంచి గుర్తింపు లభిస్తుంది. ప్రలోభాలకు లొంగవద్దు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
మకరం :- ఉద్యోగులకు పై అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు.
 
కుంభం :- మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఖర్చులు అధికమవుతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఏదో సాధించలేకపోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది.
 
మీనం :- ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ప్రింట్, మిడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.