బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-08-2024 శుక్రవారం దినఫలాలు - ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు - రాణింపు...

Mithunam
శ్రీ క్రోధినామ సం|| ఆషాఢ ఐ|| త్రయోదశి ప.3.42 ఆరుద్ర ప.12.16 రా.వ.12.32 ల 2.10. ఉ. దు. 8.15 ల 9.06 ప. దు. 12. 31 ల 1.22.
 
మేషం :- ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు అధికమవుతాయి. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థుల మొండివైఖరి మీకు ఎంతో ఆందోళనకలిగిస్తుంది.
 
వృషభం :- కోర్టు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. 
 
మిథునం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఋణం తీర్చటానికై చేయుయత్నాలు ఫలిస్తాయి. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. దుబారా ఖర్చులు అధికం. విద్యార్థులకు పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. 
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీల్లో మెళుకువ వహించండి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ అభిప్రాయాలు సున్నితంగా తెలియజేయండి. తొందరపడి హామీలివ్వవద్దు. వాగ్వాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
సింహం :- ఆర్థిక వ్యవహరాల్లో ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. దైవదర్శనాల వల్ల ప్రశాంతత పొందుతారు. అస్థిరమైన నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉంది. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యుల నుండి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి.
 
కన్య :- ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. కార్యసాధనకు లౌక్యంగా వ్యవహరించాలి. పట్టుదలకు పోవటం క్షేమం కాదు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.
 
తుల :- విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. సాంస్కృతిక, కళారంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఎరువులు, విత్తన వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. రుణభారం పెరిగే సూచన ఉన్నది. ఆచితూచి అడుగులు వేయటం మంచిది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. అధికారులకు పర్యటనలు, ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం.
 
వృశ్చికం :- పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన ధనం వసూలు విషయంలో జాప్యం తప్పదు. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఓర్పు, పట్టదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యుల నుండి అందుకున్న ఆహ్వానాలు సంతోషపరుస్తాయి.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ పాత సమస్యలు త్వరలోనే ఒక కొలిక్కి రాగలవు. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటాయి. విదేశాలు, దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
మకరం :- వృత్తి, వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలను వీడనాడి శ్రమించడం శ్రేయోదాయకం. ముఖ్యుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రింటింగ్ రంగాలవారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలుతప్పవు. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాటపడవలసి వస్తుంది.
 
కుంభం :- వృత్తి వ్యాపారులకు శుభదాయకం. ఔషధసేవనం తప్పకపోవచ్చు. రావలసిన ధనం సకాలంలో అందుకుంటారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. తలచిన పనులు వెంటనే పూర్తిచేయగలుగుతారు. గృహంలో శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యలరాకతో మీలో నూతనోత్సాహం నెలకొంటుంది. పొగడ్తలకు పొంగిపోవద్దు.
 
మీనం :- వ్యాపారస్తులకు, వృత్తుల వారికి ఆశించినంత పురోగతి ఉండదు. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలలో మెళుకువ వహించండి. బంధుమిత్రుల మధ్య అనుబంధాలు బలపడతాయి. కీలమైన వ్యవహారాల్లో మెళుకువ వహించండి. మిత్రులకిచ్చిన మాట కోసం శ్రమ, ప్రయాసలు పడవలసి ఉంటుంది.