సోమవారం, 10 మార్చి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-03-2025 శనివారం దినఫలితాలు - ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. నిర్విరామంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆప్తులతో తరుచు సంభాషిస్తారు. దూరప్రయాణం తలపెడతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కొత్త ప్రదేశం సందర్శిస్తారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధైర్యంగా ముందుకు సాగండి. అనుమానాలకు తావివ్వవద్దు. యత్నాలకు అయిన వారు ప్రోత్సహిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. అందరితోనూ మితంగా సంభాషించండి. పత్రాలు అందుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. సన్నిహితుల హితవు కార్మోన్ముఖులను చేస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అందరితోను కలుపుగోలుతనంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు పురమాయించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వేడుకకు హాజరవుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆర్థికలావాదేవీల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనాలోచితంగా వ్యవహరిస్తే కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరవు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. చేపట్టిన మొండిగా పనులు పూర్తి చేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవులు దక్కవు. కొత్త యత్నాలు మొదలెడతారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్చులు సామాన్యం. ఆప్తులతో సంభాషిస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. కీలక పత్రాలు అందుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. ముఖ్యులతో చర్చలు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. పనుల్లో ఒత్తిడి అధికం. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొత్త యత్నాలు మొదలెడతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వేడుకకు హాజరవుతారు, వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అనవర జోక్యం తగదు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. లావీదేవీల్లో ఏకాగ్రత సంప్రదింపులతో తీరిక ఉండదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఖర్చులు విపరీతం. పనులుపురమాయించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ప్రయాణం తలపెడతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చెల్లింపుల్లో జాగ్రత్త. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పనులు పురమాయించవద్దు. ఇతరుల తప్పిదాలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రముఖుల జోక్యంతో సమస్య పరిష్కారమవుతుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు.