గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (08:12 IST)

21-04-2023 తేదీ శుక్రవారం దినఫలాలు - దుర్గాదేవిని పూజించిన సర్వదా శుభం

durgashtami
మేషం :- ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరించటం వల్ల క్షణం తీరిక ఉండదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. వాయిదా పడిన పనులుపూర్తిచేస్తారు.
 
వృషభం :- వృత్తి, ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కాగలవు. చిన్నతరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఖాదీ, చేనేత, కళంకారీ, నూలు వస్త్ర వ్యాపారులు లాభసాటిగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మిథునం :- విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి లాభదాయకం. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులవల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆహార వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. 
 
కర్కాటకం :- కొంతమంది మీపై ఆధిపత్యం చెలాయించేందుకు యత్నిస్తారు. స్త్రీలకు టి.వి. కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. ప్రైవేటు సంస్థలలోని వారి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావలసివస్తుంది. 
 
సింహం :- గృహ భద్రత విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కానరాగలదు. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. స్పెక్యులేషన్ లాభదాయకంగా ఉంటుంది.
 
కన్య :- విదేశీయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. బ్యాంకింగ్ రంగంలోని వారికి పనిభారం, ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
తుల :- ఇతరులను అతిగా విశ్వసించటం వల్ల నష్టపోయే ప్రమాదముంది. బంధువులకు ధనం ఇచ్చినా తిరిగి రాజాలదు. యాదృచ్ఛికంగా మిత్రులతో కలసి ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టువ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ప్రేమికులలో నూతనోత్సాహం కానవస్తుంది. అవివాహితులకు శుభదాయకం.
 
వృశ్చికం :- బ్యాంకు పనులు మందగిస్తాయి. అవివాహితులకు శుభదాయకం. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. విద్యారంగాల్లో వారికి ఒత్తిడి. వ్యాపార విస్తరణలకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. నిరుద్యోగులకు ఆశాజనకం.
 
ధనస్సు :- ఇతరులను ధన సహాయం అడగటానికి అభిజాత్యం అడ్డువస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉద్యోగులకు పనిభారం అధికం. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. శారీరక శ్రమ, నిద్రలేమి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రముఖుల కలయిక సాధ్యపడదు.
 
మకరం :- వైద్యరంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి అక్షరదోషాల వల్ల చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవ్వడం వల్ల ఇంటికి సకాలంలో చేరలేకపోతారు. పెంపుడు జంతువులపట్ల మెళుకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేనివ్యక్తులతో మితంగా సంభాషించండి.
 
కుంభం :- అవగాహన లోపం వల్ల చిన్నచిన్న తప్పిదాలు జరిగే ఆస్కారం ఉంది. కోర్టు వ్యాజ్యాలు, ఫిర్యాదులు ఉపసంహరించుకుంటారు. గృహమరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. కిరణా, ఫ్యాన్సీ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలించవు. స్పెక్యులేషన్ లాభదాయకంగాఉంటుంది.
 
మీనం :- మీ ప్రయత్న లోపం వల్ల కొన్ని సదావకాశాలు చేజారే ఆస్కారం ఉంది. ప్రయాణాల్లో చికాకులు ఎదుర్కొంటారు. రాజకీయ, కళారంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. వాహన సౌఖ్యం పొందుతారు. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ముఖ్యుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.