1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-05-2024 బుధవారం దినఫలాలు - కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి...

Astrology
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ చతుర్ధశి సా. 5.51 స్వాతి ఉ.7.15 ప.వ.1.14 ల 2.56. ప.దు. 11.31 ల 12.22.
 
మేషం :- ఆలయాలను సందర్శిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. మార్కెటింగ్ రంగాలవారికి, ఏజెంట్లకు, బ్రోకర్లకు యాజమాన్యం నుండి ఒత్తిడి పెరుగుతుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
వృషభం :- రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. స్త్రీలు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలనే తాపత్రయం అధికమవుతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది.
 
మిథునం :- వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ఆప్తులకు ప్రియమైన వస్తువులు అందజేస్తారు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కర్కాటకం :- దైనందిన కార్యక్రమాల్లో ఎటువంటి మార్పులుండవు. ఆలయాలను సందర్శిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయికతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. చిట్స్, ఫైనాన్సు రంగాల వారు మొండి బకాయిల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాస లెదుర్కుంటారు.
 
సింహం :- భాగస్వామికుల మధ్యవిభేదాలు తలెత్తే సూచనలున్నాయి. ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనల్లో చికాకులు తప్పవు. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవటం మంచిది. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల ఒప్పందాల విషయంలో పునరాలోచన మంచిది. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు.
 
కన్య :- మీ ఏమరుపాటుతనం, నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం కలదు జాగ్రత్త వహించండి. రుణం తీర్చటానికై చేయు యత్నాలు వాయిదా పడతాయి. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి.
 
తుల :- బంధువుల రాక, అనుకోని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు. బంధువర్గాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత వహించండి. పెద్దల ఆరోగ్యములో మెళకువ అవసరం. రావలసిన ధనంలో కొంత భాగా వసూలు కాగలదు. ఉద్యోగస్తులకు తోటివారి ద్వారా ఆసక్తికరమైన వార్తలు అందుతాయి. మీ పనులు మందకొడిగా సాగుతాయి.
 
ధనస్సు :- సినిమా రంగాలలో వారికి చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలలో సఫలీకృతులవుతారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. గృహంలో మార్పులు, చేర్పులకై చేయు యత్నాలలో ఆటంకాలు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడితప్పదు.
 
మకరం :- స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. బంధువులరాకతో ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు తోటివారితో లౌక్యం అవసరం. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత లోపిస్తుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తికరంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
 
కుంభం :- మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వటం మంచిది కాదని గమనించండి. వివాదాస్పద విషయములు తొలగిపోయి స్థిరత్వం ఏర్పడుతుంది. మీ జీవితభాగస్వామి ఆరోగ్యం దెబ్బతినడంతో మానసికంగా ఆందోళన చెందుతారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మీనం :- ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో జాప్యం తప్పదు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం శ్రేయస్కరం. దైవ దర్శనాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు అయినవారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.