బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-12-2024 మంగళవారం దినఫలితాలు : ఆప్తుల సలహా పాటిస్తారు...

daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ముఖ్యులు సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆప్తుల సలహా పాటిస్తారు. మీ విషయాలకు దూరంగా ఉంచండి. నోటీసులు అందుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. పనుల్లో ఒతిడి అధికం. ఖర్చులు విపరీతం. చెల్లింపులు అవసరాలు వాయిదా వేసుకుంటారు. అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ధైర్యంగా యత్నాలు సాగించండి. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. సంప్రదింపులు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. చిన్నచిన్న చికాకులుంటాయి, ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నొప్పించవద్దు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం, చీటికిమాటికి అసహనం చెందుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పరిచయాలు బలపడతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు భారమనిపించవు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ప్రముఖులకు చేరువవుతారు. అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు మందకొడిగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. దుబారా ఖర్చులు విపరీతం. రావలసిన ధనం అందదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణం విరమించుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించి నిరుత్సాహపడతారు. ధైర్యంగా యత్నాలు సాగించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆప్తులతో సంభాషిస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కృషి ఫలిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.