శుక్రవారం, 14 జూన్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (10:29 IST)

తేదీ 30-01-2023 సోమవారం దినఫలాలు - శంఖరుడిని పూజించినా మీ సంకల్పం...

Taurus
మేషం :- ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. విద్యార్ధుల ఆలోచనల పక్కదారి పట్టకుండా తగు జాగ్రత్తలో ఉండటం క్షేమదాయకం. తోటి వారితో స్నేహ భావంతో సంచరిస్తారు.
 
వృషభం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. అవగాహన లేని వ్యాపారాలు, వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. ప్రైవేట్ ఫైనాన్స్‌లో పొదుపు, వ్యక్తులకు రుణాలు క్షేమం కాదు. స్త్రీలలో సంపాదన పట్ల ఆసక్తి మరింతబలపడుతుంది.
 
మిథునం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. స్త్రీలకు ఇతరులతో పోటీపడాలనే ధోరణి మంచిదికాదు. ఉపాధ్యాయులకు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచనవాయిదా వేయటం మంచిది.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. కొంతమంది మిమ్ములను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు. ఎప్పటినుండో వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. నూతన పరిచయాలు మీ ఉన్నతికి, పురోభివృద్ధికి తోడ్పడతాయి. సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
సింహం :- ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. అనవసరపు సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మికభేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. బంధువులను కలుసుకుంటారు. రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాల వారు తూచి వ్యవహరించాలి. స్త్రీపనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.
 
కన్య :- కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. పెద్దలుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కొత్త మిత్రుల పరిచయం మీకు ఎంతో ఆంనందాన్నిస్తుంది. రుణ విముక్తులవుతారు. కుటుంబ వైద్యలకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం. ధైర్యంగా మీ ప్రయత్నాలు సాగించండి.
 
తుల :- స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఒకానొక విషయాలో మీ చిత్తశుద్దిని ఎదుటివారు శంకించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.
 
వృశ్చికం :- రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. కుటుంబీకుల కోసం ఎంత ధనం వ్యయంచేసినా వారికి సంతృప్తి ఉండదు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. ప్రయాణాలు, బ్యాంకు పనులో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు.
 
ధనస్సు :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలకు షాపింగ్ విషయాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ప్రయాణాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. ఎటువంటి స్వార్థచింతనలేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. 
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు, కీలక వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. వాణిజ్య ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. మీ యత్నాలకు సన్నిహితులు చేయూతనిస్తారు. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు.
 
కుంభం :- ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. మీ సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు చేపడతారు. మీ లక్ష్య సాధనకు నిరంతరకృషి అవసరం. బంధువులతో సఖ్యత, రాకపోకలు పునఃప్రారంభమవుతాయి.
 
మీనం :- అకాల భోజనం, ప్రశాంతత లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ధనం ఏమాత్రం నిలబెట్టలేక పోయినా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. రిజిస్ట్రేషన్లకు ఇది అనువైన సమయం కాదు.