శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 27-01-2023 శుక్రవారం దినఫలాలు - పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు...

Weekly Astrology
మేషం :- మీ శ్రీమతి ఇచ్చిన సలహా తేలికగా కొట్టివేయటం మంచిది కాదు. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు పైఅధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
వృషభం :- ఇంటా, బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంటులు, ప్రయాణాలు వ్యాపార లావాదేవిలపై శ్రద్ద చూపుతారు. మిత్రుల ద్వారా సహాయ సహకారాలను అందుకుంటారు. స్త్రీలు విలువైన వస్త్రాలు, ఆభరణాలు అమర్చుకుంటారు. బంధువుల రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
 
మిథునం :- ఆర్థిక విషయాల్లో లక్ష్య సాధనకు పెద్దల సహకారం లభిస్తుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. బృంద కార్యక్రమాలలో ప్రముఖులను కలుసుకుంటారు. సమావేశాలో గౌరవ, మన్ననలు అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శించడం వల్ల మీ సంకల్పం నెరవేరుతుంది.
 
కర్కాటకం :- కొంతకాలంగా వెంటాడుతున్న స్తబ్ధత తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉటుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యహరిస్తారు. విరామ కాలక్షేపాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. సినీ రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకంగా ఉంటుంది.
 
సింహం :- స్నేహ బంధాలు బలపడతాయి. శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. బోధన, రవాణా, స్టేషనరీ, కమ్యూనికేషన్ల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. సహోద్యోగులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రియతముల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది.
 
కన్య :- ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమాచారం. అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువులు మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఇంటికి అవసరమైన వస్తువులు రవాణా అవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు.
 
తుల :- వృత్తి, వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. వాహనం, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. సంఘంలో విశేషగౌరవం పొందుతారు. సోదరులలో సంబంధ బాంధవ్యాలు బాగుగా బలపడతాయి.
 
వృశ్చికం :- వ్యాపారంలో లాభాలు అందుతాయి. ప్రశాంతంగా అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ జీవితం సాఫీగా ఉంటుంది. కొన్ని ఊహించని అవకాశాలు మీ తలుపుతడతాయి. విరాళాలు, చందాలకు వెచ్చిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.
 
ధనస్సు :- ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ప్రముఖుల నుండి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు చేతికందుతాయి. కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులూ ఉన్నా అన్నీ ఎదుర్కొని ముందుకుసాగుతారు.
 
మకరం :- పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తడం వల్ల ఊహించని ఖర్చులు చేయవలసివస్తుంది. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదాపడతాయి. భాగస్వామి కోసం విలువైన వస్తువులను సేకరిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. మీ ఆలోచనా విధానమే మిమ్మల్ని విజయం వైపుకు నడిపిస్తుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగస్తులకు మరిన్నీ బాధ్యతలు అధికమవుతాయి. మిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి జీవితంలో ఒక కీలకమైన మార్పు సంభవిస్తుంది. అదృష్టం మీ వెన్నంటే ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి.
 
మీనం :- ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ శ్రీమతి ఇచ్చిన సలహా తేలికగా కొట్టివేయటం మంచిది కాదు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని మీకై మీరే చిక్కుల్లో పడతారు. ఉద్యోగస్తులకు హోదాలు మరింత పెరుగుతాయి.