గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-07-2023 సోమవారం రాశిఫలాలు - ఈశ్వరునికి తైలాభిషేకం చేయి తీర్థం తీసుకుంటే...

astro8
మేషం : – పత్రిక, వార్తా సంస్థలలోని ఓర్పు, ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలు కొనుటమంచిది. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది.
 
వృషభం :- మిత్రుల కారణంగా మీ పనులు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు.
 
మిథునం :- ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గ్రహించండి. ఆత్మీయులకు, చిన్నారులకు విలువైనకానుకలందిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. కొబ్బరి, పండ్ల, పూలు, పానీయ చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.
 
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. శ్రీమతి సలహాపాటించటం చిన్నతనంగా భావించకండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వ్యాపారాల్లో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు విజయం సాధిస్తారు.
 
సింహం :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సోదర, సోదరి వ్యవహారాల్లో ఊహించని మార్పులు కానరాగలవు. మీ సాధనలో కొన్నిసార్లు వైఫల్యం తలెత్తినా ధైర్యంతోనూ తెలివితోనూ ఎదుర్కొండి. మీమాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారన్న విషయం గమనించండి.
 
కన్య :- వారసత్వపు వ్యవహారాలలో కొన్ని సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు బంధువర్గాలతోనూ, చుట్టుప్రక్కల వారితోనూ పట్టింపులేర్పడతాయి. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గించుకోవాలనలే మీ యత్నం అనుకూలిస్తుంది.
 
తుల :- చర్మానికి సంబంధించిన చికాకులు, కాళ్ళు, ఎముకలు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది.
 
వృశ్చికం :- క్రీడపట్ల ఆసక్తి చూపుతారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. సోదర, సోదరి వ్యవహారాల్లో ఊహించని మార్పులు కానరాగలవు. ఉద్యోగస్తులకు పనిభారం, బాధ్యతలు అధికం.
 
ధనస్సు :- ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ప్రత్తి, పొగాకు, గోధుమల వ్యాపారస్తులకు సంతృప్తి, అభివృద్ధి కానరాగలదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి.
 
మకరం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు తోటివారి మాట ధోరణి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక ముఖ్యమైన విషయమై న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కుంభం :- స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. మిత్రుల కలయికతో గతకాలపు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఉపాధ్యాయులకు, విద్యాసంస్థల్లో వారికి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. ఎంతో శ్రమించిన మీదటగాని అనుకున్న పనులు పూర్తి కావు. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి.
 
మీనం :- ఆర్ధిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తికరంగా ఉండదు. విదేశీచదువుల కోసం విద్యార్థులు చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. సినిమా, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.