గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-07-2023 శుక్రవారం రాశిఫలాలు - పార్వతిదేవిని పూజించిన మనోవాంఛలు...

astro5
మేషం :- గృహంలో మార్పులకై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. చేతి వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.
 
వృషభం :- మీ ముఖ్యల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికుల మధ్య విభేధాలు తలెత్తుతాయి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెళకువ అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భాగస్వామిక వ్యాపారాల్లో మీ అధిపత్యానికి భంగం కలుగవచ్చు.
 
మిథునం :- ఆర్థిక స్థితిలో ఆశిస్తున మార్పులు సంభవిస్తాయి. ఆస్తిపంపకాలకు సంబంధించి కుటుంబీకులతో అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులకు వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ఉద్యోగపరంగా మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. 
 
కర్కాటకం :- చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రేషన్ డీలర్లకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
సింహం :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. దాన ధర్మాలు చేయడంవల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బిల్లులుచెల్లిస్తారు.
 
కన్య :- వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. ప్రేమికులు అతిగా వ్యవహరించటంవల్ల చికాకులు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి కలిసివస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది.
 
తుల :- కుటుంబీకుల మద్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహరాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. పత్రిక, వార్తా సంస్థలోని వారికి సదావకాశాలు లభిస్తాయి. మీ సంతానం ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు తప్పవు.
 
వృశ్చికం :- దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతాయి. నిరంతర శ్రమతో మీరు ఆశించిన లక్ష్యాలను చేరుకోండి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యంఅంతగా ఉండదు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలు మందకొడిగా సాగుతాయి.
 
ధనస్సు :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగులు స్థానచలన యత్నాలు అనుకూలిస్తాయి.
 
మకరం :- ఉన్నతాధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. లాయర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. విదేశాల్లోని ఆత్మీయులకు విలువైన వస్తుసామగ్రి అందజేస్తారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. మీ బలహీనతను ఆసరా చేసుకుని కొంతమంది లబ్ధి పొందాలని యత్నిస్తారు. 
 
కుంభం :- ఊహించని ఖర్చుల వల్ల అధిక ధనవ్యయం తప్పదు. వైద్యుల సలహా తప్పదు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. కీడు తలపెట్టె స్నేహానికి దూరంగా ఉండండి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
మీనం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. మీ విషయంలో ఒక చిన్న పొరపాటు పెద్ద తప్పిదంగా మారుతుంది.