సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-07-2023 గురువారం రాశిఫలాలు - వినాయకుడిని ఆరాధించిన సంకల్పసిద్ధి..

astro4
మేషం :- నూతన వ్యాపారాలు, ఆర్ధిక లావాదేవీలపట్ల శ్రద్ధ వహిస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమికులమధ్య అనుమానాలు, అపార్థాలు చోటు చేసుకుంటాయి.
 
వృషభం :- రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉపాధ్యాయుల తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి ఆశాజనకం.
 
మిథునం :- ఆడిటర్లకు ఆకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. విద్యార్థులను నూతన పరిచయాలేర్పడతాయి. వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ, స్టేషనరీ, మందుల, ఆల్కహాలు వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది.
 
కర్కాటకం :- చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా అయినా పూర్తి కాగలవు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలుంటాయి. ఏ విషయంలోను తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు.
 
సింహం :- రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. వాహన యోగం వంటి శుభ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల విషయంలో మెళుకువ వహించండి. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికం. బంధు మిత్రుల పట్ల సంయమనం పాటించండి. అతిధి మర్యాధలు బాగుగా నిర్వహిస్తారు. 
 
కన్య :- కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు.
 
తుల :- స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినా గానీ నెమ్మదిగా సమసిపోతాయి. ఇతరుల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకండి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింత శ్రమించవలసి ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి.
 
వృశ్చికం :- ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. నూతన దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కుటింబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయులకు మీసమస్యలు తెలియచేయటం వల్ల ప్రయోజనం ఉంటుంది. నిరుద్యోగులకు ఒక అవకాశం అప్రయత్నంగా కలిసిరాగలదు.
 
ధనస్సు :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు కృషి ఫలిస్తుంది. ప్రత్యర్థులు సైతం మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. 
 
మకరం :- అధికారులతో ఏకీభావం కుదరదు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారుల్లో పోటీతత్వం పెరుగుతుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ముఖ్యమైన విషయాలలో పెద్దల మాటను శిరసావహిస్తారు. ఆర్ధికాభివృద్ధి పొందుతారు. ఏదన్నా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి.
 
కుంభం :- ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. మీ సంతాన విషయంలో సంతృప్తి కానవస్తుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. వ్యపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. బంధు మిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు.
 
మీనం :- వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం.