శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By Raman
Last Modified: సోమవారం, 29 ఆగస్టు 2016 (20:05 IST)

2017 జనవరి వరకు అష్టమ శనిదోషం(జి. వినయ్ బాబు- తిరుపతి)

జి. వినయ్ బాబు- తిరుపతి: మీరు త్రయోదశి, ఆదివారం, మిధునలగ్నం, అశ్వని నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. 2017 జనవరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల చేస్తున్న ఉద్యోగంలో ఒత్తిడి, చికాకు, అశాంతి వంటివి ఎదుర్కొంటారు. ప్రతి శనివారం 9 సార్లు నవగ్రహ ప్రదక్షిణ

జి. వినయ్ బాబు- తిరుపతి: మీరు త్రయోదశి, ఆదివారం, మిధునలగ్నం, అశ్వని నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. 2017 జనవరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల చేస్తున్న ఉద్యోగంలో ఒత్తిడి, చికాకు, అశాంతి వంటివి ఎదుర్కొంటారు. ప్రతి శనివారం 9 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి, ఎర్రని పూలతో శనిని పూజించిన దోషాలు తొలగిపోతాయి. 2017 నందు మీ అభివృద్ధికి మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. 
 
2015 జూన్ నుండి చంద్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ చంద్రుడు 2018 నుండి 2025 వరకూ మంచి అభివృద్ధిని ఇవ్వగలడు. అప్పుడుప్పుడు కాళ్లు, పొట్టకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. అశ్విని దేవతలను ఆరాధించడం వల్ల మీకు ఆటంకాలు తొలగిపోతాయి. దేవాలయాల్లో జీడిమామిడి చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.