గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 6 నవంబరు 2022 (10:13 IST)

06-11-2022 నుంచి 12-11-2022 వరకు మీ వార రాశిఫలాలు

Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
వ్యవహారానుకూలత ఉంది. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. సమర్థకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వనసమారాధనలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ఈ వారం ఆశాజనకం. శుభవార్తలు వింటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు హోదామార్పు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో అనుభవం గడిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ప్రయాణం విరమించుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఆర్థిక ఇబ్బందులెదుర్కుంటారు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. డబ్బు చేతిలో నిలవదు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవదు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మంగళ, బుధవారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. గురువారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. స్వల్ప
అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. కీలక చర్చల్లో ప్రముఖంగా పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం. విలాసాలకు వ్యయం చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. శుక్ర, శనివారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అతిగా పొగిడేవారిని ఓ కంట కనిపెట్టండి. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
సంతోషకరమైన వార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు కొలిక్కివస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు భారమనిపించవు. ఆది, బుధవారాల్లో పనులు సాగవు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య సౌఖ్యం, వాహనయోగం ఉన్నాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రయాణం సజావుగా సాగుతుంది.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. సంతానం విదేశీ విద్యాయత్నాం ఫలిస్తుంది. ఆధ్మాత్మికతపై దృష్టి పెడతారు. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి పురోభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ఆదాయానికి లోటుండదు. దుబారా ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో వ్యవహరించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. బుధవారం నాడు కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహమార్పు అనివార్యం. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. దైవదీక్షలు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారుల తీరును గమనించి
మెలగండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ ప్రణాళికలు ఆశించిన ఫలితమీయవు. క్రీడాకరులకు ప్రోత్సాహకరం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయానికి కుంగిపోవద్దు. త్వరలో పరిస్తితులు మెరుగుపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. గురు, శుక్రవారాల్లో పనులు ఒక పట్టాన సాగవు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆదాయం బాగుంటుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. సంప్రదింపులకు అనుకూలం. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆది, శనివారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు, ఆలోచనల్లో మార్పు వస్తుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పత్రాల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరగుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
శుభవార్తలు వింటారు. మీ శ్రమ వృధా కాదు. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రతి విషయాన్నీ నిశింతగా గమనించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఆదాయం బాగుంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. సామరస్యగా సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పందాలు, బెట్టింగ్‌కు పాల్పడవద్దు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
సంకల్పసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. బుధ, గురువారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులకు మీ సమస్యలను తెలియజేయండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. న్యాయ, సేవ, వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరవుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.