బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2024 (16:30 IST)

13-10-2004 నుంచి 19-10-2024 వరకు మీ వార ఫలితాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహబలం ఆశాజనకంగా ఉంది. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురి చేస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. శనివారం నాడు ప్రముఖుల సందర్శించినా ఫలితం ఉండదు. కార్యక్రమాలు మొండిగా కొనసాగిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రలోభాలకు లొంగవద్దు. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం సంతృప్తినిస్తుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సమయస్పూర్తితో వ్యవహరించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ పెద్దల ఆరోగ్యం కుదుటపడతుంది. గృహమరమ్మతులు చేపడతారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యమవుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం కలిసివచ్చే సమయం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. సంతానం మొండితనం చికాకుపరుస్తుంది. అనునయంగా మెలగండి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. దైవదీక్షలు స్వీకరిస్తారు. ప్రయాణం వాయిదా వేసుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. సర్వత్రా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కృషితో కూడిన ఫలితాలున్నాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయవ్యయాలకు పొంతన ఉండదు. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కొత్త చికాకులెదురవుతాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. వాహనదారులకు అత్యుత్సాహం తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ధృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సోమ, మంగళవారాల్లో లావాదేవీలతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. భేషజాలకు పోవద్దు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. వాయిదాల చెల్లింపులను అశ్రద్ధ చేయకండి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ప్రియతములతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను నమ్మవద్దు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. సంతానం కృషి ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు నిరాశాజనకం. ఉపాధ్యాయులకు బాధ్యతల మార్పు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు నిరుత్సాహపడవద్దు. త్వరలో పరిస్థితలు అనుకూలిస్తాయి. సన్నిహితుల వ్యాఖ్యలు మిమ్ములను కార్యోన్ముఖులను చేస్తాయి. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. బుధవారం నాడు పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. గృహనిర్మాణాలకు ప్లాను ఆమోదమవుతుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులకు యూనియన్ గుర్తింపు లభిస్తుంది.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. కొన్ని విషయాలు మీరు ఊహించినట్టే జరుగుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆసక్తికరమైన విషయాలు  తెలుసుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. శుక్రవారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. అధికారులకు హోదామార్పు. నూతన వ్యాపారాలు కలసివస్తాయి. సరుకు నిలలో జాగ్రత్త. న్యాయ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. వస్త్రప్రాప్తి, వాహనయోగం పొందుతారు. శనివారం నాడు ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకోండి. భేషజాలకు పోవద్దు. సంతానం దుడుకుతనం ఇబ్బంది కలిగిస్తుంది. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మనోధైర్యంతో మెలగండి. లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. నిర్దేశిత ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. కీలక విషయాల్లో అయిన వారి సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. చేతివృత్తులు, కార్మికులకు అవకాశాలు లభిస్తాయి. దూరప్రయాణం తలపెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
విశేషయోగాలు ఉన్నాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండిధైర్యంతో అడుగు ముందుకేయండి. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. పాతపరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. మంగళవారం నాడు విలువైన వస్తువులు జాగ్రత్త. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి నిదానంగా అనుకూలిస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. నూతన పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. గురు, శుక్రవారాల్లో కొత్త సమస్యలెదురయ్యే ఆస్కారం ఉంది. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పనులు, కార్యక్రమాలు స్వయంగా చూసుకోండి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. సన్నిహితుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి కష్టకాలం. భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మనోబలంలో యత్నాలు సాగించండి. చేస్తున్న పనులు ఆపివేయవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానానికి శుభయోగం. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం, అనుభం గడిస్తారు. ఉద్యోగసుకు ఉన్నత పదవీయోగం. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.