ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Modified: సోమవారం, 20 డిశెంబరు 2021 (20:24 IST)

2022 సింహరాశి ఫలితాలు: ఆచితూచి వ్యవహరించాలి

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయం: 8 వ్యయం: 14 రాజ్యపూజ్యం: 1 అవమానం: 5

 
ఈ రాశివారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. స్వయంకృషితోనే సత్ఫలితాలు సాధిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిశ్చయమవుతుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. 

 
పదవులు బాధ్యతల నుంచి తప్పుకోవలసి వస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. ఉపాధి పథకాలు, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు బాగుంటుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు సదవకాశాలు లభిస్తాయి. కార్మికులకు యోగదాయకం. 

 
మార్కెట్ రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. వ్యవసాయ రంగాల వారికి సామాన్యం. ఎరువులు, క్రమిసంహారక మందుల విక్రయదారులకు కొత్త సమస్యలెదురవుతాయి. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ర్యాంకుల సాధనకు విద్యార్థులు ఓర్పు, పట్టుదలతో శ్రమించాలి. అధ్యాపకులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరం.