సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Modified: సోమవారం, 20 డిశెంబరు 2021 (16:01 IST)

2022లో మిధునరాశి ఫలితాలు: వివాహ సంబంధాలు చూస్తారు కానీ...

మిథునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆదాయం: 11 వ్యయం: 5 రాజ్యపూజ్యం: 2 అవమానం: 2


ఈ రాశివారికి గృహసంచారం యోగదాయకంగానే ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం బాగుంటుంది. చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు మీ స్తోమతకు తగ్గట్టుగానే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఐతే దళారులు, వివాహ సంబంధ ఏజెన్సీలను విశ్వసించవద్దు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 

 
సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. న్యాయ నిపుణులతో సంప్రదించవలసి వస్తుంది. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవటం క్షేమదాయకం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. 

 
అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉద్యోగస్తులకు యూనియన్ లో గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. పంటల దిగుబడి బాగుంటుంది. గిట్టుబాటు ధర విషయంలో సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు, నూతన పెట్టుబడులకు అనుకూలం. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. రవాణ, ఎగుమతి దిగుమతి రంగాల వారికి ఆశాజనకం. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.