గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అయోధ్య రామాలయం
Written By వి
Last Modified: బుధవారం, 5 ఆగస్టు 2020 (15:34 IST)

ప్రపంచమంతా రామమయం: అయోధ్య నుంచి నరేంద్ర మోదీ

ప్రపంచమంతా రామమయమేనని ప్రధాని మోదీ అన్నారు. మన పొరుగున ఉన్న దేశాల సంస్కృతిలో కూడా రాముడున్నాడని చెప్పారు. ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచడం రాముడి వల్లే సాధ్యమని అన్నారు. బుద్దుడి బోధనల్లో, గాంధీజీ ఉద్యమాల్లో రాముడు ఉన్నాడని తెలిపారు.
 
కబీర్, గురునానక్ వంటి వారికి రాముడు స్పూర్తి అన్నారు. మనం ఎలా బతకాలన్న విషయం రాముడి జీవితం మనకు బోధిస్తుందన్నారు. అయోధ్య భూమి పూజలో పాలు పంచుకోవడం తన అదృష్టమని మోదీ అన్నారు. మనదేశంలో పలు భాషల్లో రామాయణాన్ని రచించారని, రాముడు అనగా సత్యమని చెప్పారు.
 
మన అందరిలో రాముడు ఉన్నాడని తెలిపారు. రాముడు జాతీయ సెంటిమెంట్ అన్నారు. అయోధ్య భూమి పూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రధాని మోదీ ప్రసంగించారు.