గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (15:32 IST)

వేపచెట్టు నీడలో విశ్రమిస్తారో...?

దాదాపు 200 ఏళ్లపాటు జీవించే చెట్టు వేప. వేప చెట్టులోని అన్ని భాగాలు వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతాయి. అందువలనే వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కొనియాడుతోంది. ఆయుర్వేదంలో పేర్కొన్న పిత్త, ప్రకోప లక్షణాలను నివారించడానికి వేప ఆకును ఉపయోగిస్తారు.
 
చర్మ వ్యాధులు, కంటి జబ్బులు, కడుపులోని పురుగుపు నివారణ, బి.పి, మలేరియా వంటి పలు వ్యాధుల నివారణకు యాంటీ సెప్టిక్ మందుగా వైద్యులు వేప ఆకులను ఉపయోగిస్తారు. 
 
చికెన్ పాక్స్‌గా పిలువబడే అమ్మవారు సోకినప్పుడు చికిత్సలో భాగంగా రోగిని వేక ఆకులపై పడుకోబెడతారు. చర్మంపై మంటలు, దురదలు, మధుమేహం వంటి వ్యాధులను అదుపు చేయడానికి వేప పువ్వులను వినియోగిస్తారు. సౌందర్య పోషణలో భాగంగా కొందరు వేప ఆకులు వేసి కాచిన నీటితో స్నానం చేస్తారు.
 
ప్రాచీన ఆయుర్వేదం గ్రంధంలో చరకుడు ఇలా చెప్పాడు.. ఎవరైతే పగటిపూట వేపచెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా, ఎక్కువకాలం జీవిస్తారు. ఇన్ని సుగుణాలున్న వేప చెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా అభివర్ణించవచ్చు.